Everyday is a festival day at Sri Renuka Puttalamba Thalli. On each specific day, the goddesses of goddess blesses her devotees in a specific ritual during the week days. Click here to read more.
1427 లో బహమని సుల్తాన్ అహమద్ షా ధాటికి రెడ్డి సామ్రాజ్యం పునాధులతో కదిలిపోయింది. తొలి కబళంగా కొండవీడి కూలిపోయింది. వరుసగా అద్దంకి నాగార్జున కొండ బెల్లం కొండ, వినుకొండ, ధరణికోట నేలకూలాయి. ఇక మిగిలింది కొండవల్లి ఖిల్లా. మహమ్మదీయులు సేనావాహిని ఉప్పెనలా వచ్చి కొండపల్లిని చక్రబంధం చేసింది. ఖిల్లా అజేయంగా తలయెత్తుకు నిలబడింది. అదేమి దురదృష్టమో కోట బీటలు వారకుండానే రెడ్డి రేడు గుండె బీటలు వారింది మంత్రలు సేనానులైన మలిరెడ్డి, కొల్లారెడ్డి వారు దుర్గందుర్భుద్యమని తూర్పు పడమర ద్వారాలను కాచుకుంటే చాలునని అందుకు తగినంత బలం కోటలో ఉందని ఎంతగానో చెప్పారు.